ఆసుపత్రిలో నాలుగు మోకాలు మార్పిడి ఆపరేషన్లు

SRCL: వేములవాడ ఏరియా ఆసుపత్రిలో ఆదివారం మరో నాలుగు మోకాలు మార్పిడి ఆపరేషన్లు దిగ్విజయంగా పూర్తి చేశారు. ఇప్పటివరకు 48 మోకాలు మార్పిడి ఆపరేషన్లు జరిగాయి. వేములవాడ ప్రాంత ప్రజలే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి కూడా ఈ ఆపరేషన్ల కోసం వేములవాడకు వస్తున్నారు. దాదాపు 100 మంది దాకా ఆపరేషన్ల కోసం ఎదురుచూస్తున్నారు. ఇక నుంచి క్రమం తప్పకుండా ప్రతివారం చేస్తామన్నారు.