ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు

ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు

ATP: రాయదుర్గం మండల పరిధిలోని కేటీఎస్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో భారత రాజ్యాంగ దినోత్సవం వేడుకలు బుధవారం ఘనంగా నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపల్, అధ్యాపక బృందం విద్యార్థినీ, విద్యార్థులతో కలిసి రాజ్యాంగ పీఠికను శ్రద్ధగా పఠించారు. ప్రిన్సిపల్ శ్రీనివాసులు మాట్లాడుతూ.. ప్రపంచంలో విశిష్టమైన, అతి పెద్దదైన లిఖిత రాజ్యాంగం భారతదేశానికి ఉండడం గర్వకారణం అన్నారు.