ప్రశాంతంగా NEET PG పరీక్ష

కృష్ణా: పెనమలూరు మండలంలోని కానూరు ION డిజిటల్ జోన్‌లో నిర్వహించిన NEET PG ప్రవేశ పరీక్ష ప్రశాంత వాతావరణంలో ఆదివారం ముగిసింది. పెనమలూరు సీఐ జే.వీ.రమణ పర్యవేక్షణలో భద్రతా, ట్రాఫిక్ ఏర్పాట్లు సమర్థవంతంగా చేపట్టారు. పరీక్ష కేంద్రానికి వచ్చిన అభ్యర్థులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకున్నారు.