ఎమ్మెల్యే బండారు రేపటి పర్యటన వివరములు

ఎమ్మెల్యే బండారు రేపటి పర్యటన వివరములు

కోనసీమ: కొత్తపేట మండలం వానపల్లి గ్రామంలో రేపు ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పర్యటించనున్నారు. స్వర్ణ వానపల్లిలో భాగంగా పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు. ఆత్రేయపురం మండలం ఉచ్చిలి గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన మంచినీటి కుళాయి, నూతనంగా నిర్మించనున్న వంతెన శంకుస్థాపనలో పాల్గొంటారని ఆయన కార్యాలయం ఓ ప్రకటలో తెలిపింది.