'భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి'

PDPL: రెండు రోజులు పెద్దపల్లి జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, దీనిపై వాతావరణ శాఖ సూచనల మేరకు జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదివారం తెలిపారు. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా ఆగస్టు 18,19 తేదీలలో ఈ వర్షణాలు కురిసే అవకాశం ఉందని, జిల్లాకు ఎల్లో అలర్ట్ జారీ చేసినట్లు, అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సూచించారు.