విత్తనాలు తినడంతో బాలుడికి తీవ్ర సమస్య

విత్తనాలు తినడంతో బాలుడికి తీవ్ర సమస్య

BDK: భద్రాచలంలో ఆశ్చర్యకరమైన ఘటన ఇవాళ చోటుచేసుకుంది. 8ఏళ్ల బాలుడు తీవ్రమైన కడుపునొప్పితో, ఆసుపత్రికి వెళ్లారు. వైద్యులు బాలుడి కడుపును పరిశీలించగా మలద్వారంలో గట్టి రాళ్ల వంటి గడ్డలు కనిపించాయి. వైద్యులు మరింతగా విచారించగా బాలుడు అడవిలో దొరికే మురళి పండ్లను విత్తనాలతో సహ తిన్నట్లు తెలిపారు. వైద్యులు స్పందించి బాలుడిని కాపాడేందుకు చర్యలు తీసుకున్నారు.