VIDEO: సరైన డ్రైనేజ్ సౌకర్యాన్ని కల్పించాలని సీపీఎం నేతల డిమాండ్

JN: జనగామలో సరైన డ్రైనేజ్ సౌకర్యం లేకపోవడంతో చిన్న వర్షానికే రోడ్డు మొత్తం జలమయం అవుతుందని సీపీఎం జిల్లా కార్యదర్శి మోపు కనకా రెడ్డి ఆరోపించారు. గురువారం కురిసిన మోస్తారు వర్షానికే చంపక్ హిల్స్‌కు వెళ్ళే రహదారిపై నీరు నిలవడంతో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని అన్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు పట్టించుకోని సమస్యను వెంటనే పరిష్కరించాలన్నారు.