ఫిర్యాదులను త్వరగా పరిష్కరించాలి: కలెక్టర్‌

ఫిర్యాదులను త్వరగా పరిష్కరించాలి: కలెక్టర్‌

SRPT: ప్రజావాణిలో ప్రజల నుంచి అందిన దరఖాస్తులను అధికారులు యుద్ధప్రతిపాదికన పరిష్కరించాలని కలెక్టర్‌ తేజస్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన బాధితుల నుంచి 68 ఫిర్యాదులను స్వీకరించారు. సమస్యల పరిష్కారంలో జాప్యం చేయకుండా, బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు ఉన్నారు.