అక్రమ రేషన్ బియ్యం పట్టివేత
KNR: హుజూరాబాద్ పట్టణంలో అక్రమంగా నిల్వ ఉంచిన భారీ పరిమాణంలో రేషన్ బియ్యాన్ని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్‌మెంట్ అధికారులు సీజ్ చేశారు. బాలాజీ ట్రేడర్స్ దుకాణంలో 298 క్వింటాళ్ల ప్రభుత్వ రేషన్ బియ్యాన్ని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. పేదలకు పంపిణీ చేయాల్సిన బియ్యం పక్కదారి పడుతున్నాయనే సమాచారంతో అధికారులు ఈ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.