భారీ వర్షాల కారణంగా పంట నష్టం వాటిల్లింది: MLA

ADB: జిల్లాలో భారీ వర్షాల కారణంగా పంట నష్టం వాటిల్లిందని ఎమ్మెల్యే పాయల్ శంకర్ పేర్కొన్నారు. బోరజ్ మండలంలోని పలు గ్రామాల్లో తహసీల్దార్ రాజేశ్వరి, వ్యవసాయ శాఖ అధికారులతో కలిసి సోమవారం పర్యటించారు. భారీ వర్షాలకు దాదాపు 12 వేల ఎకరాల పంట నష్టం జరిగిందన్నారు. నష్టపోయిన రైతులను ఆదుకోవాలని కోరుతూ సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాసినట్టు పేర్కొన్నారు.