అప్పక్పల్లి-కోయిలకొండ రోడ్డు పూర్తి చేయాలి
NRPT: నారాయణపేట మండలం అప్పక్పల్లి నుంచి కోయిలకొండ వరకు రెండు వరుసల రోడ్డును పూర్తి చేయాలని సీపీఐ ఎంఎల్ మాస్ లైన్ పార్టీ నేతలు కలెక్టర్ ప్రతీక్ జైన్‌కి వినతిపత్రం సమర్పించారు. కాంట్రాక్టర్ మోహన్ రెడ్డి రోడ్డు పనులను అసంపూర్తిగా వదిలేశారని.. దీనివల్ల ప్రయాణికులు, వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారని నేతలు తెలిపారు.