VIRAL: మానవత్వం చాటుకున్న యువకుడు

VIRAL: మానవత్వం చాటుకున్న యువకుడు

రాజస్థాన్‌ బికనీర్ జిల్లాలో కురిసిన భారీ వడగళ్ల వర్షంలో ఓ యువకుడి మానవత్వం చాటుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఈదురుగాలులతో కూడిన వడగళ్ల వాన ధాటికి ప్రజలంతా సురక్షిత ప్రాంతాలకు వెళ్లగా, ఓ ఆవు దూడ మాత్రం బయట తాడుతో కట్టేసి ఉంది. ఆ వడగళ్ల దెబ్బలకు ఆ మూగజీవి విలవిల్లాడుతుండటం గమనించిన ఓ యువకుడు, తన ప్రాణాలకు తెగించి బయటకు వచ్చి ఆ దూడను కాపాడాడు.