VIDEO: నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించిన డీసీపీ

VIDEO: నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించిన డీసీపీ

MDCL: వినాయక నిమజ్జనాల సందర్భంగా అధికారులు అప్రమత్తంగా ఉండాలని మల్కాజిగిరి డీసీపీ పద్మజా రెడ్డి సూచించారు. మంగళవారం ఘట్కేసర్‌లో లక్ష్మీనారాయణ చెరువు వద్ద నిమజ్జన ఏర్పాట్లను ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా పోలీసులు, విద్యుత్ శాఖ సిబ్బంది, స్థానిక నాయకులకు ఆమె తగిన సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ వెంకటరమణ, ఏసీపీ చక్రపాణి తదితరులు పాల్గొన్నారు.