'ప్రజల రక్షణే ధ్యేయంగా పోలీసులు పనిచేయాలి'

'ప్రజల రక్షణే ధ్యేయంగా పోలీసులు పనిచేయాలి'

NZB: ప్రజల రక్షణే ధ్యేయంగా పోలీసులు పనిచేయాలని అలాగే ఫిర్యాదుదారులతో మర్యాదగా ప్రవర్తించాలని ఏసీపీ రాజా వెంకట్రెడ్డి అన్నారు. వార్షిక తనిఖీల్లో భాగంగా గురవారం ఇందల్వాయి పోలీస్ స్టేషన్‌ను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ పరిసరాలను, సీజ్ చేసిన వాహనాలను, రిసెప్షన్ రికార్డ్, రైటర్ రూమ్‌ను పరిశీలించారు. అనంతరం పోలీస్ స్టేషన్ ఆవరణలో మొక్కలను నాటారు.