రేపు పామూరులో విద్యుత్ సరఫరా నిలిపివేత

రేపు పామూరులో విద్యుత్ సరఫరా నిలిపివేత

ప్రకాశం: పామూరు సబ్స్‌స్టేషన్ పరిధిలోని అన్ని గ్రామాలకు బుధవారం ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు విద్యుత్ ఏఈ జిలాని భాష తెలిపారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ.. రూరల్ డెవలప్మెంట్ స్కీమ్ అభివృద్ధి పనులులో భాగంగా విద్యుత్ సరఫరా నిలిపివేయడం జరుగుతుందన్నారు. వినియోగదారులు గమనించి సహకరించాలని కోరారు.