రోడ్డు భద్రతా డ్రైవ్.. ప్రతిజ్ఞ చేసిన విద్యార్థులు
HYD: సంతోష్ నగర్ పరిధిలో ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ మహమ్మద్ ఆసిఫ్ ఆధ్వర్యంలో 'అరైవ్ అలైవ్' రోడ్డు భద్రతా డ్రైవ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఓ స్కూల్ విద్యార్థులు రోడ్డుపై మానవ హారంగా ఏర్పడి అవగాహన కల్పించారు. ట్రాఫిక్ నిబంధనలను విధిగా పాటిస్తామని ప్రతిజ్ఞ చేశారు. ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని, నిబంధనలు పాటించడం బాధ్యతని అధికారులు తెలిపారు.