VIDEO: గ్యాస్ కొరత.. సిలిండర్ల కోసం తెల్లవారుజామునే క్యూ
MHBD: బయ్యారం మండల కేంద్రంలో గ్యాస్ సిలిండర్ల కొరతతో వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారు. వారం రోజులుగా సరఫరా లేకపోవడంతో సుమారు 1200 బుకింగ్‌లు పెండింగ్‌లో ఉండగా కేవలం 342 సిలిండర్లు మాత్రమే చేరాయి. సిలిండర్లు వచ్చిన సమాచారం తెలుసుకున్న ప్రజలు ఇవాళ గ్యాస్ గోదాం వద్ద క్యూ కట్టారు. సరఫరా తక్కువగా ఉండటంతో అందరికీ సిలిండర్లు అందకపోవచ్చన్న ఆందోళతో బారులు తీరారు.