పెండింగ్ రుసుముల్ని చెల్లించండి: టీడీపీ ఎమ్మెల్సీలు

పెండింగ్ రుసుముల్ని చెల్లించండి: టీడీపీ ఎమ్మెల్సీలు

AP: గత విద్యా సంవత్సరం పెండింగ్‌లో ఉన్న బోధనా రుసుముల్ని ఆయా విద్యా సంస్థలకు చెల్లించాలని టీడీపీ ఎమ్మెల్సీలు వేపాడ చిరంజీవిరావు, భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి, ఆలపాటి రాజేంద్రప్రసాద్, రాజశేఖర్, కంచర్ల శ్రీకాంత్ కోరారు. ఈ మేరకు సీఎం చంద్రబాబుకు లేఖ రాశారు. అలాగే, ఈ ఏడాది ఫీజుల విడుదల క్యాలెండర్ ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు.