ఉత్తమ ప్రధానోపాధ్యాయురాలుగా జ్యోతిర్లత

ఉత్తమ ప్రధానోపాధ్యాయురాలుగా జ్యోతిర్లత

సత్యసాయి: కొత్తచెరువు శ్రీ సత్యసాయి ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ జ్యోతిర్లత ఉత్తమ ప్రధానోపాధ్యాయురాలుగా ఎంపికయింది. పుట్టపర్తిలో జరిగిన 76వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో కలెక్టర్ చేతన్ ఆమెకు ప్రశంసా పత్రాన్ని అందించారు. ఈ గుర్తింపు రావడానికి ముఖ్య కారణం తనతో పని చేసే ఉపాధ్యాయ సిబ్బంది అని జ్యోతిర్లత తెలిపారు.