దేవస్థానం ట్రస్ట్ బోర్డు ఏర్పాటుకు నోటిఫికేషన్

NLR: రాపూరు మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన పెంచలకోన దేవస్థానం పాలకమండలి నియామకానికి ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఎట్టకేలకు 8 ఏళ్ల తరువాత దేవాదాయ శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. నోటిఫికేషన్ విడుదల చేసిన 20 రోజుల్లోపు ఆసక్తి గలవారు పాలక మండలి సభ్యులుగా దరఖాస్తు చేసుకోవాలని ఆలయ అసిస్టెంట్ కమిషనర్ పోరెడ్డి శ్రీనివాసులు రెడ్డి తెలిపారు.