పాఠశాల విద్యార్థినులకు హెచ్పీవీ టీకాలు

పాఠశాల విద్యార్థినులకు హెచ్పీవీ టీకాలు

KNR: గంగాధర మండలంలోని ఓద్యారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థినులకు హెచ్పీవీ టీకా కార్యక్రమం విజయవంతంగా నిర్వహించారు. గర్భాశయ గ్రీవా క్యాన్సర్ నివారణకు ఉద్దేశించిన ఈ టీకాలను 14-15 ఏళ్ల బాలికలకు వైద్యులు డా. శ్వేత, డా. శిరీష ఆధ్వర్యంలో వేశారు. అర్హులైన ప్రతి విద్యార్థిని టీకా పొందేలా చూడాలని ఎంఈవో ప్రభాకర్ రావు హెచ్ఎంలను కోరారు.