రోడ్డుకు నిధులు మంజూరు
NZB: నందిపేట్ మండలంలో గల చీమ్రాజపల్లి, లక్కంపల్లి, తల్వేద గ్రామాల రోడ్డు వెడల్పునకు రూ. 6.93 కోట్లు మంజూరైనట్లు నందిపేట్ మండలాధ్యక్షుడు మంద మహిపాల్ తెలిపారు. నిధులు మంజూరు చేసిన వినయ్ కుమార్ రెడ్డికి, ఆర్ అండ్ బీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి మూడు గ్రామాల ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో విలేజ్ కమిటీ సభ్యులు, యువకులు పాల్గొన్నారు.