స్పా సెంటర్ ముసుగులో వ్యభిచారం.. నిర్వాహకులపై కేసు
స్పా సెంటర్ల ముసుగులో వ్యభిచారం చేస్తున్న ముఠా గుట్టును ఢిల్లీ పోలీసులు రట్టు చేశారు. రోహిణి ప్రాంతంలోని క్రిస్టల్ బ్యూటీ స్పా సెంటర్‌పై దాడి చేసి ముగ్గురు విటులను అరెస్ట్ చేశారు. ఐదుగురు మహిళలు, ఆరుగురు మైనర్లను రక్షించారు. నిర్వాహకులపై పోక్సో కేసు నమోదు చేశారు. మైనర్లకు గంటకు రూ.7500 కంటే ఎక్కువ నగదును ఛార్జ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.