VIDEO: CPR చేసి పసి ప్రాణం కాపాడిన అంబులెన్స్ సిబ్బంది
KMR: బాన్సువాడకు చెందిన నీలిమా ఇవాళ బాన్సువాడ మాతా శిశు ఆసుపత్రిలో ప్రసవించారు. అధిక బరువుతో మగబిడ్డకు జన్మనివ్వగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడింది. NZB జిల్లా ఆసుపత్రికి 108 నియోనేటల్ అంబులెన్సులో తరలిస్తుండగా శిశువు పరిస్థితి విషమించింది. దీంతో EMT రాజు CPR చేసి పసి ప్రాణం కాపాడారు. సకాలంలో ఆసుపత్రికి చేర్చిన సిబ్బందినీ వైద్యులు అభినందించారు