పులివెందుల లో రేపు బండలాగుడు పోటీలు

పులివెందుల లో రేపు బండలాగుడు పోటీలు

KDP: పులివెందుల మున్సిపాలిటీ పరిధిలో కదిరి రింగ్ రోడ్డు వద్ద దిన్నెపాటి గంగమ్మ తిరునాల బుధవారం నిర్వహించనున్నట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. తిరునాల సందర్భంగా రేపు ఎద్దుల బండ లాగుడు పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. మొదటి బహుమతి రూ. లక్ష ఉంటుందన్నారు. ఇందులో 6 బహుమతులు ఉంటాయన్నారు. ఈ పోటీలో పాల్గొనాలనుకున్న వారు బుధవారంలోపు పేరు నమోదు చేసుకోవాలన్నారు.