సీసీఐ నిబంధనలు తొలగించాలి: రైతు సంఘం

సీసీఐ నిబంధనలు తొలగించాలి: రైతు సంఘం

KRNL: పత్తి పంటను పూర్తిస్థాయిలో కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేస్తూ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో సోమవారం ఎమ్మిగనూరు తహశీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా రైతు సంఘం నాయకులు అబ్దుల్లా, లక్ష్మీనరసింహ మాట్లాడుతూ.. రైతులు తెచ్చిన పత్తిని సీసీఐ కేంద్రాల్లో మార్క్‌ఫెడ్ అధికారులు పూర్తిగా కొనుగోలు చేయకుండా వాపస్ పంపడం తగదని అన్నారు.