HCA ఎన్నికల ఫలితాలు విడుదల
HCA ఉప ఎన్నికల పోరు ముగిసింది. ఉప్పల్ స్టేడియంలో జరిగిన లెక్కింపులో ట్రెజరర్ పదవికి జరిగిన హోరాహోరీ పోరులో అనిల్ కుమార్, ప్రత్యర్థి హరినారాయణ్‌పై 2 ఓట్ల స్వల్ప మెజారిటీతో విజయం సాధించారు. మరోవైపు, కార్యదర్శి పదవికి మన్నె జీవన్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికవ్వగా, ఎన్నికల అధికారి వి.ఎస్. సంపత్ కుమార్ విజేతలకు ధృవీకరణ పత్రాలు అందజేశారు.