మేం అధికారంలోకి రావడం ఖాయం: అంబటి

AP: తాము అధికారంలోకి రావడం ఖాయమని వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు ధీమా వ్యక్తం చేశారు. రాజధాని కోసం లక్ష కోట్లు ఖర్చుపెడుతున్నారని, గుంతలో రాజధాని కట్టారని గుర్తుచేశారు. కాదు కొండవీడు వాగులోనే పెడతామంటే మీ ఇష్టం.. పొలాలు ఇచ్చిన రైతులు లబోదిబోమంటున్నారని తెలిపారు. 30 ఏళ్లయినా అమరావతి పూర్తి కాదన్నారు. అమరావతి కూటమి నేతలకు ఏటీఎంలా మారిందని ఆరోపించారు.