'దిత్వా తుఫాన్ హెచ్చరిక.. పంట కోయవద్దు'
GNTR: దిత్వా తుఫాన్ ప్రభావంతో నేడు, సోమవారం, మంగళవారం వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున రైతులు వరి పంటలను తొందరపడి కోయవద్దని మండల వ్యవసాయ అధికారి రమణ విజ్ఞప్తి చేశారు. మూడు రోజుల తర్వాత కోత ప్రారంభించాలని సూచించారు. ఇప్పటికే పంటలను కోసిన రైతులు ధాన్యాన్ని ఈ మధ్యాహ్నం లోపు సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆయన సూచించారు.