'అర్హులకు త్వరలో పింఛన్లు'
AKP: అర్హులైన వారికి త్వరలోనే పింఛన్లు, రేషన్ కార్డులు, ఇళ్ల స్థలాలు మంజూరు చేస్తామని స్టేట్ అర్బన్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఛైర్మన్ పీలా గోవింద తెలిపారు. అనకాపల్లిలో పబ్లిక్ గ్రీవెన్స్ నిర్వహించి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం ఇస్తామన్నారు. రీ-సర్వే, భూ సమస్యలపై అధికారులు అలసత్వం వహిస్తే చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.