చందనోత్సవం ఏర్పాట్లపై మంత్రులు సమీక్ష

చందనోత్సవం ఏర్పాట్లపై మంత్రులు సమీక్ష

విశాఖ కలెక్టరేట్‌లో సింహాచలం అప్పన్న స్వామి చందనోత్సవం ఏర్పాట్లపై దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, జిల్లా ఇంఛార్జ్ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామితో పాటు విశాఖ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. చందనోత్సవంలో ఎటువంటి లోటుపాట్లు జరగరాదని, మంచినీళ్లు, క్యూ లైన్‌లు, పారిశుధ్యం విషయంలో ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.