శ్రీ శ్రీ కనకమహాలక్ష్మిని దర్శించుకున్న ఎమ్మెల్యే
PPM: చీపురుపల్లి అమ్మవారు 28వ జాతర మహోత్సవంలో స్థానిక ఎమ్మెల్యే కిమిడి కళా వెంకట్రావు కుటుంబ సమేతంగా ఆదివారం ఉదయం అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కుటుంబ సభ్యులకు ఆలయ కమిటీ ఘన స్వాగతం పలికారు. సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజలు ఆరోగ్యాలతో సుఖంగా ఉండాలని అమ్మవారిని కోరుకున్నానని తెలిపారు.