కౌలాస్ నాల ప్రాజెక్టుకు తగ్గిన ఇన్ ఫ్లో

KMR: వర్షాలు తగ్గుముఖం పట్టడంతో కౌలాస్ నాల ప్రాజెక్టు ఇన్ ఫ్లో తగ్గిపోయింది. మంగళవారం ప్రాజెక్టులోకి 242 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తుండడంతో ప్రాజెక్ట్ ద్వారా నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం దిగువకు 100 క్యూసెక్కుల ఔట్ ఫ్లో విడుదల అవుతుందని అధికారులు తెలిపారు. ప్రాజెక్ట్ నీటి మట్టం 457.85/458 మీటర్లు ఉండగా, నీటి సామర్థ్యం 1.201/1.237 టీఎంసీలకు చేరుకుంది.