సైడ్ డ్రైన్ నిర్మాణ పనులకు శంకుస్థాపన
ఖమ్మం 50వ డివిజన్ లో రూ. 35 లక్షల వ్యయంతో డ్రైనేజీ నిర్మాణ పనులకు శుక్రవారం మేయర్ పూనుకొల్లు నీరజ శంకుస్థాపన చేశారు. డివిజన్‌లో అభివృద్ధి పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయని, అందులో భాగంగా ఆర్టీసీ కాలనీ రోడ్ నెంబర్ 2, పీవీ నరసింహారావు పార్క్ మెయిన్ గేట్ ఎదురుగా సైడ్ డ్రైన్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశామని మేయర్ తెలిపారు.