పోస్టల్ బ్యాలెట్‌ను వినియోగించుకునేందుకు బారులు తీరిన ఉద్యోగులు

కడప: బద్వేల్ నియోజకవర్గంలో పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకునేందుకు బద్వేలు పట్టణంలోని స్థానిక జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో ఎన్నికల అధికారులు ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్ వద్ద ఆదివారం ప్రభుత్వ ఉద్యోగులు బారులు తీరారు. ఆ మేరకు పోలింగ్ దృష్ట్యా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఆకుల వెంకటరమణ తెలిపారు.