VIDEO: 'ప్రొద్దుటూరు శివాలయం భూమి కబ్జా'
KDP: ప్రొద్దుటూరులోని అగస్త్యేశ్వరాలయం (శివాలయం)కు చెందిన సుమారు రూ .20 కోట్ల విలువైన భూమి కబ్జాకు గురైందని ఎంపీపీ శేఖర్ యాదవ్, మాజీ మున్సిపల్ వైస్ ఛైర్మన్ బంగారు రెడ్డి ఆరోపించారు. ఇవాళ వారు ఆలయ భూమి వద్దకు వెళ్లి పరిశీలించారు. టీడీపీకి చెందిన ఒక నాయకుడు ఈ భూమిని కబ్జా చేసి, ప్రైవేట్ నిర్మాణాల కోసం భూమి పూజ చేశారని ఆరోపించారు.