శాంతియుత వాతావరణంలో గణేశ్ ఉత్సవాలు జరుపుకోవాలి: CP

KMM: శాంతియుత వాతావరణంలో గణేష్ నవరాత్రుల ఉత్సవాలు జరుపుకోవాలి పోలీస్ కమిషనర్ సునీల్ దత్ సూచించారు. ఖమ్మం పోలీస్ కమిషనరేట్ పరిధిలో గణేష్ మండపం నిర్వహణ కోసం పోలీసుశాఖ వారు రూపొందించిన పోర్టల్ policeportal.tspolice.gov.inలో ధరఖాస్తు చేసుకోవాలని అన్నారు. అనుమతి పత్రం మంజూరైన తర్వాతే గణేష్ మండపాలు ఏర్పాటు చేయాలన్నారు.