నెల్లూరులో టెన్త్ యువతి ఆత్మహత్య
NLR: నగరంలోని ఫతేఖాన్ పేటలో లావణ్య అనే విద్యార్థిని గురువారం ఆత్మహత్య చేసుకుంది. స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్ స్కూల్లో ఆమె పదో తరగతి చదువుతుంది. మధ్యాహ్నం భోజనం అనంతరం స్కూల్ నుంచి వచ్చి ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. పోస్టుమార్టం నిమిత్తం బాడీని ప్రభుత్వ ఆసుపత్రికి పోలీసులు తరలించారు. మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.