రేపు కృష్ణాపురంలో ఎమ్మెల్యే పర్యటన
ATP: గార్లదిన్నె మండలం కృష్ణాపురంలో రేపు ఉదయం 9:30 గంటలకు ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే బండారు శ్రావణి ముఖ్య అతిథిగా హాజరవుతారని టీడీపీ మండల కన్వీనర్ రంగనాయకులు తెలిపారు. అధికారులు, కూటమి నాయకులు కలిసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు.