ఇళ్లు ఇప్పించాలని ఎమ్మెల్యేకు చిన్నారుల వినతి
MHBD: డబుల్ బెడ్రూమ్ ఇళ్లు పంపిణీ చేయాలని తొర్రూరు పట్టణంలోని విశ్రాంతి భవనం ఎదుట CPM ఆధ్వర్యంలో మూడో రోజు రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. ఈ కార్యక్రమంలో లబ్ధిదారుల పిల్లలు పాల్గొని 'మాకు ఇళ్లు లేదు.. అద్దెకు ఉంటున్నాం. ఎమ్మెల్యే మేడం మాకు ఇళ్లు ఇప్పించండి.' అంటూ చిన్నారులు వేడుకున్నారు. ఈ నిరసనలో CPM మండల కార్యదర్శి MD.యాకుబ్, జిల్లా నాయకులు బొల్లం ఆశోక్ పాల్గొన్నారు.