ఇచ్చిన ప్రతీ హామీని నెరవేరుస్తున్నాం: ఎమ్మెల్యే

కోనసీమ: వైసీపీ హయాంలో కుదేలైన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను కూటమి ఏడాది పాలనలోనే చక్కదిద్ది ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తున్నామని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు వ్యాఖ్యానించారు. గురువారం ఆత్రేయపురం మండలం ఉచ్చిలిలో జరిగిన 'సుపరిపాలనలో తొలి అడుగు' కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఇంటింటికీ వెళ్లి సంక్షేమ పథకాలు వివరించారు.