మత్తుముక్త జిల్లాయే మా లక్ష్యం: ఎస్పీ
మహబూబ్ నగర్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ‘ప్రజా భద్రత పోలీస్ బాధ్యత’ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అడిషనల్ ఎస్పీ రత్నం మాట్లాడుతూ.. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. మత్తు వ్యసనం భవిష్యత్తును నాశనం చేస్తుందని హెచ్చరిస్తూ, మత్తుముక్త మహబూబ్ నగర్ జిల్లా నిర్మాణమే తమ లక్ష్యమని పేర్కొన్నారు.