పెన్నాలో పెరిగిన వరద ప్రవాహం

పెన్నాలో పెరిగిన వరద ప్రవాహం

KDP: చెన్నూరు సమీపాన పెన్నా నదిలో నీటి ప్రవాహం పెరిగింది. ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లాయి. ఈక్రమంలో ఆ వరద నీరంతా పెన్నాలోకి చేరుతోంది. దీనికి తోడు పలు గ్రామాల్లో నిర్మించిన చెక్ డ్యాంలు నీటితో కళకళలాడుతున్నాయి. భూగర్భ జలాలు కూడా గణనీయంగా పెరిగాయని రైతులు అంటున్నారు.