కవితపై బండ నరేందర్ రెడ్డి ఫైర్..!

కవితపై బండ నరేందర్ రెడ్డి ఫైర్..!

నల్గొండ మాజీ జెడ్పీ ఛైర్మన్ బండ నరేందర్ రెడ్డి కల్వకుంట్ల కవితపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కేసీఆర్, కేటీఆర్‌ను ఒంటరి చేయాలనే ఉద్దేశంతోనే కవిత తమ నాయకులపై విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. "ఆమె ఆస్తుల పెరుగుదలను చూస్తే అవినీతిపరురాలని నమ్మక తప్పదు" అని ఆయన ధ్వజమెత్తారు. కవిత మాటలు బీఆర్‌ఎస్ శ్రేణులను రగిలిస్తున్నాయని తీవ్ర స్ధాయిలో  మండిపడ్డారు.