రీ సర్వే గడువు వారం రోజులు పెంచాలని వినతి

KRNL: పెద్దకడబూరు మండలం చిన్నతుంబళంలో జరుగుతున్న రీ సర్వే పనులను మరో వారం రోజులు పెంచాలని మాజీ ఎంపీటీసీ కేపీ యల్లప్ప ఆధ్వర్యంలో రైతులు సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్‌కు మంగళవారం వినతిపత్రం అందజేశారు. రీ సర్వే పనులను సబ్ కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించి, సచివాలయాలను తనిఖీ చేశారు. గ్రామంలో అపరిశుభ్రతపై పంచాయతీ సెక్రెటరీపై ఆగ్రహం వ్యక్తం చేశారు.