రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు
KDP: కలసపాడు మండలం సిద్ధమూర్తి పల్లె సమీపంలో బైకు అదుపుతప్పి ఇద్దరి యువకులకు తీవ్ర గాయాలయ్యాయి. కలసపాడు వెళ్తున్న వారు రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. వీరిలో ఒకరికి స్వల్ప గాయాలు కాగా, కాలువిరిగింది. స్థానికుల సహాయంతో 108 ద్వారా పోరుమామిళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రులు నరసాపురానికి చెందిన వారిగా గుర్తించారు.