ఈదురు గాలులతో కూడిన వర్షం.. రైతులకు నష్టం
KKD: జిల్లాలో ఈదురు గాలులతో కురిసిన వర్షాలకు మామిడి రైతులకు తీవ్ర నష్టాన్ని కలిగించింది. బలమైన గాలులకు చెట్లపై ఉన్న మామిడి పండ్లు నేలరాలాయి. కోతకు సిద్దంగా ఉన్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకోవడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే వేసవి వేడి వల్ల దిగుబడి పూర్తిగా తగ్గిపోగా, ఈదురు గాలులు మరింత నష్టాన్ని పెంచడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేందుతున్నారు.