'అక్రమ డిప్యూటేషన్లను రద్దు చేయాలి'

RR: అక్రమ డిప్యూటేషన్లను రద్దు చేయాలని SFI జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీకాంత్ అన్నారు. మంగళవారం చౌదరిగూడ మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాల ముందు ప్లకార్డులతో ఆందోళనకు దిగారు. షాద్‌నగర్ నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో అక్రమ డిప్యూటేషన్ల పరంపర కొనసాగుతుందని, దీనికి రాజకీయ నాయకుల పైరవీలే కారణమన్నారు. డిప్యూటేషన్లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.