చిరుత సంచారం.. భయాందోళనలో ప్రజలు
SRD: జిన్నారం మండల ప్రాంతంలో చిరుత సంచారం తీవ్ర కలకలం రేపింది. స్థానికుల వివరాలు.. గత నెల రోజుల నుంచి ప్రజలను భయాందోళనకు గురి చేస్తుందన్నారు. స్థానిక రైతుకు చెందిన లేగదూడపై దాడి చేసి హతమార్చినట్లు తెలిపారు. సమాచారం అందుకున్న బీట్ అధికారి విజయ్ కుమార్ ప్రజలను అప్రమత్తం చేసేందుకు ఫ్లెక్సీలు, ఇతర ఏర్పాట్లు చేస్తామని పెర్కొన్నారు.