కొయ్యూరు మండలంలో ఓటర్లు ఎంతంటే..?
ASR: కొయ్యూరు మండలంలో మొత్తం 43,711మంది ఓటర్లు ఉన్నారని డిప్యూటీ ఎంపీడీవో ఎం.బాబూరావు గురువారం తెలిపారు. వీరిలో పురుష ఓటర్లు 29,835, మహిళలు 22,876 మంది ఉన్నారన్నారు. ఎన్నికల సంఘం ఆదేశాలతో అన్ని పంచాయతీల్లో ఎన్నికల ఓటర్ల జాబితా ప్రదర్శించడం జరిగిందన్నారు. జాబితా తనిఖీ చేసుకోవాలని సూచించారు. ఏవైనా అభ్యంతరాలు ఉంటే పంచాయతీ అభివృద్ధి అధికారులకు తెలపాలన్నారు.